EmaiPoyave Song Lyrics in Telugu And English - Sid Sriram Lyrics
Singer | Sid Sriram |
Movie | Padi Padi Leche Manasu |
Music | Vishal Chandrashekar |
Song Writer. | Krishna Kanth |
శర్వానంద్, సాయి పల్లవి జోడీగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పడి పడి లేచె మనసు’ మూవీ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఏమైపోయావే’ అనే సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. దూరమైన ప్రేమికురాలిని తలచుకుంటూ ప్రియుడు పడే వేదనను ఎంతో హృద్యంగా హృదయాలను హద్దుకునే విధంగా ఆలపించారు సింగర్ సిద్ శ్రీరామ్. విశాల్ చంద్ర శేఖర్ అద్భుతమైన స్వరాలను సమకూర్చగా.. క్రిష్ణకాంత్ గుండెల్ని పిండేసే లిరిక్స్ అందించారు. తాజా సాంగ్ రిలిక్స్‌తో పాటు పాటను కూడా ఓసారి వినేయండి.
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే
నిను వీడిపోనంది నా ప్రాణమే
💔మరణాన్ని ఆపేటి వరమే నీవే
Coming soon
Telugu Lyrics:-
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే నువ్వంటు లేకుంటే
నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే
పుస్తకమే విసిరేసావే
నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి
ఆయువునే తీసేశావే
నిను వీడిపోనంది నా ప్రాణమే
నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే
సగమే నే మిగిలున్నా శాసనమిది చెబుతున్నా
పోనే లేనే నిన్నొదిలే
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే
ఎటు చూడు నువ్వే ఎటు వెళ్ళనే
నే లేని చోటే నీ హృదయమే
నువ్వు లేని కళ కూడా రానే రాదే
కళలాగ నువ్ మారకే
💔మరణాన్ని ఆపేటి వరమే నీవే
విరహాల విషమీయకే
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే
English Lyrics:-
Coming soon
0 Comments